హక్కుల సాధన ఐఎన్‌టియుసితోనే సాధ్యం
సెంటినరికాలనీ, జూన్ 18, (జనం సాక్షి):
సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన ఐఎన్‌ట యుసి తోనే సాధ్యమని సంఘనాయకులు బడికెల రాజలింగం అన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఐఎన్‌టియుసి కార్మికులకు ఎన్నో హక్కులను తెచ్చిపెట్టిందన్నారు. అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించామన్నారు. ఎన్నిక ల్లో ఐఎన్‌టియుసి ఓటేసి గెలిపించాలని ఆయన కోరా రు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గౌతం శంకరయ్య, కొంకటి మోహన్, కె.రామారావు, సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.