మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

1
– 31 మంది మృతి

భోపాల్‌,ఆగస్ట్‌5(జనంసాక్షి):

భారీ వర్షాల కారణంగా పట్టాలపై నీరు నిలవడంతో  మధ్యప్రదేశ్‌లో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. కుదావా రైల్వేస్టేషన్‌ సవిూపంలో మంగళవారం అర్ధరాత్రి కొద్ది తేడాలో రెండు రైళ్లు పట్టాలు తప్పడంతో ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 31మంది మృతి చెందగా, మరో 25మందికి గాయాలయ్యాయి. తొలుత ముంబయి నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 6 బోగీలు మాచక్‌నది సవిూపంలోని కల్వర్టు దాటుతుండగా పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు సుమారు 300 మంది ప్రయాణికులను కాపాడారు. ఖిర్కియా-భిరంగి రైల్వేస్టేషన్ల మధ్య రాత్రి 11.45 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన కొన్ని క్షణాల్లోనే జబల్‌పూర్‌ నుంచి ముంబయి వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ సమాచార లోపం కారణంగా ఇదే ప్రాంతంలో మరో ట్రాక్‌పై పట్టాలు తప్పింది. ఇంజిన్‌తో సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయని రైల్వేశాఖ  అధికారులు  తెలిపారు. మాచక్‌నది వంతెనపై దుర్ఘటన జరిగినట్లు తొలుత వార్తలొచ్చాయని, వంతెన కంటే ముందున్న కల్వర్టు వద్ద ప్రమాదం జరిగిందని వివరించారు. పట్టాలపై భారీగా నిలిచిన నీరే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థరించారు. మాచక్‌ నది అనూహ్యంగా పొంగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. 25మంది వైద్యులు, సహాయ సిబ్బందితో బయల్దేరిన ప్రత్యేక రైలు కూడా పట్టాలపై భారీగా నీరు నిలవడంతో మధ్యలోనే నిలిచిపోయింది. మాచక్‌ నది ప్రవాహం ఉద్దృతంగా ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా భారీగా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను హర్దాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ చర్యల కోసం మరో మూడు రైళ్లలో సిబ్బంది, వైద్యులు ప్రమాద స్థలికి బయల్దేరారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఇటార్సీ రైల్వే స్టేషన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి సిబ్బందిని ఘటనా స్థలికి తరలించి సహాయక చర్యలు చేపట్టింది.రాత్రి సమయం కావడం, భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకాలు తలెత్తాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి సహయక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రమాదానికి గురైన రైళ్లలోని ప్రయాణికులను ఇటార్సీ స్టేషన్‌కు చేర్చామని రైల్వేశాఖ పీఆర్వో అనిల్‌ సక్సేనా తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోకి నీరు చేరిందని వివరించారు. ఘటనాస్థలంలో ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీసినట్లు హర్దా ఎస్పీ తెలిపారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలిని బుధవారం ఉదయం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. హర్దా పట్టణంలోని పలువురు వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రధాని మోడీ తదితరుల విచారం

మధ్యప్రదేశ్‌లోని మాచక్‌ నది సవిూపంలో కల్వర్టు వద్ద మంగళవార రాత్రి రెండు రైళ్లు పట్టాలు తప్పిన దుర్ఘటన బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.మధ్యప్రదేశ్‌లోని మాచక్‌ నది సవిూపంలో కల్వర్టు వద్ద జరిగిన రైలు ప్రమాదాలపై కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నట్లు రాజ్‌నాథ్‌సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా సవిూపంలో రెండు రైళ్లు పట్టాలు తప్పిన దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రెండు రైలు ప్రమాద ఘటనలు బాధాకరమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే వైద్య సదుపాయం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మృతులకు 2 లక్షల పరిహారం

రైలు ప్రమాదంలో మృతులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పగాయాలతో బయటపడిన వారికి రూ.25వేలు అందించనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పరిహారం వెంటనే అందజేస్తామని, ఆలస్యం చేయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు స్పష్టం చేశారు.విజయవాడ, సికింద్రాబాద్‌లో రైల్వే హెల్ప్‌లైన్‌ కేంద్రాలు

రైలు ప్రమాదం దృష్ట్యా సికింద్రాబాద్‌, విజయవాడలో హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం కోసం సికింద్రాబాద్‌: 040-27786140, 040-27700868, 040-27786539, విజయవాడ: 0866-2575038,0866-2575036,0866-2576796 నంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. రైళ్ల రద్దు, రాకపోకల సమాచారం హెల్ప్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.  ఈ ఘటనపై సమాచారమందించేందుకు రైల్వేశాఖ భోపాల్‌, హర్దా, ఇటార్సీ, వారణాసి రైల్వే స్టేషన్లలో హైల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

ప్రమాదంపై సిఎం కెసిఆర్‌గ్భ్భ్రాంతి

మధ్యప్రదేశ్‌లోని రైలు ప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనేకమంది మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.