మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం

హైదరాబాద్:మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపం కుంభకోణం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కుంభకోణంలో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న జర్నలిస్ట్… నిన్న మెడికల్ డీన్‌… తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ట్రైనీ ఎస్‌ఐ చనిపోయింది. సాగర్‌లో అనామిక కుష్వాహా అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీస్‌ అకాడమీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. గతంలో వ్యాపం రిక్రూట్‌మెంట్‌ ద్వారానే ఈయన ఎస్‌ఐగా సెలక్ట్ అయింది. వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. వ్యాపం స్కామ్‌లో మొత్తం మృతుల సంఖ్య 48కి చేరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.