మధ్యప్రదేశ్ వలస బాల కార్మికురాలు అత్యాచారా హత్య దోషులను శిక్షించాలి.. పౌర హక్కుల సంఘం తెలంగాణ..

పెద్దపల్లి జిల్లా అప్పన్న పేట గ్రామం లో రియల్ ఎస్టేట్ వెంచర్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రo బాల్కెడ్ జిల్లా కాజ్రీ గ్రామానికి చెందిన నమ్రీత అనే 16 సంవత్సరాల మైనర్ బాలిక తన అక్క, బావ లతో కలిసి వారి పిల్లలను చూస్తూ భవన నిర్మాణ పనులకు వెళ్తుంది. అక్కడ పని చేసే వ్యక్తి తన ఇంటిలో పని ఉన్నదని తేదీ 14/08/23న మధ్యాహ్నం సమయం లో తీసుకువెళ్లిన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తర్వాత ఆ వ్యక్తులు బాలిక ను పెద్దపల్లి బస్టాండ్ లో వదిలి పెట్టగా అప్పన్న పేట కు చెందిన వ్యక్తి బాలిక ను గుర్తుంచి వారు పనిచేసే ఎస్టేట్ వద్ద ఆమెను దింపాడు. తీవ్ర రక్త స్రావం, వాంతులతో జరిగిన విషయాన్ని బాలిక తన అక్క, బావలకు, ఇతర కుటుంబ సభ్యులకు చెప్పింది. అక్క,బావ ఈ విషయాన్ని వాళ్లను పనికోసం తీసుకువచ్చిన మేస్రి గోపాల్ కు చెప్పారు.అండగా ఉండవలసిన మేస్త్రీ వారిని ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే అందరిని చంపివేస్తామని భయబ్రాంతులకు గురిచేసాడు. రాత్రంతా తీవ్ర రక్త స్రావం, వాతులతో అనారోగ్యానికి గురైన బాలికకు ఎలాంటి వైద్యం చేపించకుండా , ఇట్టి ఘటన గురుంచి పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా, అందరిని చంపుతామని బెదిరించి బోలెరాలో వారిని తేదీ 15/08/2023 ఉదయం మధ్యప్రదేశ్ కు పంపించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో తీవ్ర రక్త స్రావం తో బాలిక చనిపోయినది. ఈ విషయాన్ని ఆమె తల్లి ఫోన్ ద్వారా ఇక్కడి వారికి చెప్పింది.
ఇట్టి ఘటనను పౌరహక్కుల సంఘం, విరసం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తుంది.
గతంలో పెద్దపల్లి జిల్లా రాఘవా పూర్ ఇటుక బట్టిలో సూల్జా బాను అనే గర్భిణీ ని కొట్టి చంపిన ఘటన మొదలు క్రెన్ పడి బాలుడి మృతి, అధిక లోడ్ తో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి చెందిన సంఘటనలు ఎన్నో జరిగాయి . ఇటుక బట్టీలలో,భవన నిర్మాణ రంగంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలిలపై దాడులు,హత్యలు, మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలు.
Banded labour act – 1976, child labour act – 1986,2016,
inter – state migrants workmen act – 1979 పై ఏ చట్టాలు కూడా పెద్దపల్లి జిల్లా లో అమలు కావడం లేదు. వలస కార్మికులకు అండగా ఉండవలసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, కార్మిక శాఖ, రెవిన్యూ, పోలీస్ లు బాధ్యతా రాహిత్య విధులకు మూల కారణం ఇక్కడి స్థానిక BRS పార్టీ నాయకుల అధికార దుర్వినియోగం, చట్టవ్యతిరేకమైన పనుల వలన దొషులకు రక్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలను చిత్తశుద్ధితో ఆపివేయడానికి కృషి చేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని మరొక్కసారి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
గత ఐదు సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన వలస కార్మికుల అత్యాచారాల ఘటనలు దాడులపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి .
ఈ ఘటనకు మూలకారకులైన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించాలి.
పెద్దపల్లి ప్రాంతం అంటేనే వలస కార్మికులపై దాడులు అత్యాచారాలు విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జరుగుతున్న ప్రాంతంగా రికార్డు కు ఎక్కింది ఈ అమానవీయ దౌర్జన్యకర పద్ధతులను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పాల్గొన్న వారు..
1.N. నారాయణ రావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ.
2.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.పుల్ల సుచరిత,ఉపాధ్యక్షురాలు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
4.నార వినోద్, ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.బండారి రాజలింగయ్య, EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.బాలసాని రాజయ్య, విరసం నాయకులు.
7.గుమ్మడి కొమురయ్య, కన్వీనర్, తెలంగాణ ప్రజాఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా.
8.గాండ్ల మల్లేషం,కోకన్వీనర్, తెలంగాణ ప్రజాఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా.
అప్పన్నపేట గ్రామం, పెద్దపెల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సాయంత్రం 4-40,
గురువారం,17 ఆగస్ట్,2023.