మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
2022 మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకు రూ.2 వేలు వేతనం పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.నేటికీ వేతనం పెంచుతున్నట్లు జీఓ విడుదల కాలేదని, వెంటనే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.శుక్రవారం డీఈఓ ఆఫీసులో మెమొరాండం అందజేసి మాట్లాడారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు.ప్రతి విద్యార్థికి రూ.15 కేటాయించాలని కోరారు.కోడిగుడ్లు ప్రభుత్వమే సప్లై చేయాలని , పెండింగ్ బిల్లులు,వేతనాలు వెంటనే విడుదలచేయాలన్నారు.కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక నాయకులు కె వరలక్ష్మి, చెరుకు యాకలక్ష్మి , బేగం , జయమ్మ , నాగమణి , తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.