మనందరం సీఎం కేసీఆర్ తో కలిసి నడుద్దాం : ఎమ్మెల్యే పైళ్ల

రూ” 600కోట్లతో అభివృద్ధి చేశా మరోసారి ఆశీర్వదించండి

ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పైళ్ల నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహాకారంతో భువనగిరి నియోజకవర్గంలో రూ” 600 కోట్లతో అభివృద్ధి చేశానని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవడానికి మనందరం సీఎం కేసీఆర్ తో కలిసి నడువడంతో పాటు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలందరీ ఆశీస్సులతో తనను మరోసారి అసెంబ్లీకి పంపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభ వేదిక నుంచి విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్డును అభివృద్ధి చేసుకోవడంతో పాటు భువనగిరి పెద్ద చెరువు, బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరణ చేయడం జరిగిందన్నారు. భువనగిరి పట్టణంలో గత సంవత్సరం నుండి కిసాన్ నగర్ అర్బన్ కాలనీ రోడ్లు అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఎలా ఉన్నదో మనందరికీ తెలుసని నేడు ఏవిధంగా అభివృద్ధి చేశామో మన కళ్ళకు కనిపిస్తుందని ఆయన వివరించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే వైకుంఠధామాలు, మోడల్ స్కూల్ లను పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, వికలాంగుల పింఛన్లు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు, క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇవే కాకుండా రానున్న కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో విడుదల చేశారని ఆ పథకాలు ఒక సామాజిక విప్లవాన్ని తీసుకువస్తాయని అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రానికి అతి తొందర్లో డిగ్రీ కళాశాల, ఐటి హబ్ ఏర్పాటు చేయాలని, భువనగిరి వరకు మెట్రో రైలు పొడిగించాలని, నరసింహా రిజర్వాయర్ నిర్మాణ క్రమంలో భూమి కోల్పోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని భువనగిరి పోచంపల్లి కేంద్రాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈసందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ నీ కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ రైతు సమన్వయ కన్వీనర్ అమరేందర్ , జడ్పిటిసి బీరు మల్లయ్య ఎంపీపీ నిర్మల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యమార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి, మండల అధ్యక్షులు జనగాం పాండుజెడ్పిటిసిలు ఎంపీపీలు మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్ బలుగురి మధుసూదన్ రెడ్డి జక్కరాఘవేందర్ రెడ్డి రాకల శ్రీనివాస్, ఓం ప్రకాష్ సర్పంచులు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.