మనోసుగంధాలు

నా నయనాల తీరాల్లో

నీ మధురోహలు

కలల కెరటాలై

ఎగిసిపడుతూ

కనువిందు చేస్తుంటాయి…

నా ఆశల వసంతాల్లో

నీ భావాల సుమాలు

విరబూస్తూ

మనోసుగంధాలై

అనుబంధాలైపోతుంటాయి…

నా ఆలోచనల గగనాల్లో

నీ ధ్యాసల మేఘాలు

కదలాడుతూ

తొలకరి జల్లులై

వలపుల తలపులైపోతుంటాయి…

ప్రియా!

నీ జ్ఞాపకాలు మీటే

నా గుండె తీగల్లోంచి

అనుభూతుల రాగాలు

పురివిప్పుతూ

అనురాగాలైపోతుంటాయి…

–  డాక్టర్ కొత్వాలు అమరేంద్ర  (సెల్: 9177732414 )