మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్
దండేపల్లి. జనంసాక్షి అక్టోబర్ 13. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలంలోని మోకాసిగూడ పాత మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దొరవారిపల్లె పాఠశాలలో గురువారం మండల పరిషత్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పనులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పనులను మరింత వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసర్తి అనిల్ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్ ఎంపిటిసి ముత్య రాజయ్య ఆయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు smc చైర్మన్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు