మన సంబంధాలు భేష్‌: భారత్‌, జపాన్‌ ప్రధానులు

 

నాంపెస్‌: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, జపాన్‌ ప్రధానమంత్రి యొషిహిహికొ నొడా కాంబోడియాలో కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపిన ఈ నేతలిదరూ మరింత మెరుగా ముందంజ వేయడం గురించి చర్చించుకున్నారు. గతంలో జపాన్‌ రాజధాని టోక్యోలోనే నవంబర్‌ 16న వీరిద్దరూ కలుసుకోవలసి ఉన్నప్పటికి అది సాధ్యపడలేదు. జపాన్‌లో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో సింగ్‌ జపాన్‌ పర్యటన రద్దయింది. ప్రస్తుతం తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా సింగ్‌, నోడాలు సమావేశమయ్యే అవకాశం వచ్చింది. రెండు దేశాల మధ్య సంబంధాలు చక్కగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని ఇరువురూ వ్యక్తం చేశారు.భారత్‌, జపాన్‌ మధ్య ద్వైసాక్షిక సంబంధాలు చారిత్రాత్మకంగా ముందడుగు వేశాయని, రెండు దేశాని మథ్యా పటిష్ఠమైన దౌత్య సంబంధాలకు 60 ఏళ్ళు పూర్తియ్యాయని ప్రారంభోపన్యాసం చేసిన నోడా గుర్తి చేశారు. ప్రస్తుతం వ్యూహాత్మక సహజ భాగస్వామ్యం స్థాయికి ఈ సంబంధాలు చేరుకున్నాయని పేర్కొన్నారు. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం ఆయనతో ఏకీభవించారు. రెండు దేశాల మధ్యా అత్యుత్తమ సంబంధాలున్నాయన్నారు.ఇదిలా ఉండగా భూగర్భం నుంచి ఆరుదైన ఖనిజాల వెలికీతీతపై భారత్‌, జపాన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనితో పాటే మౌలిక వసతుల రంగంలోనూ మరికొన్ని ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.