మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

 

మయన్మార్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తన పరిపాలనలో అమెరికాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఒబామా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. మయన్మార్‌లో చారిత్రక పర్యటనకు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ దేశాల సదస్సు ( ఏషియన్‌ )లో ఒబామా పాల్గొననున్నారు. ఈ పర్యటనతో మయన్మార్‌లో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చరిత్ర సృష్టించనున్నారు. 1953లో ఉపరాష్ట్రపతి హోదాలో రిచర్డ్‌ విక్సన్‌ మియన్మార్‌లో పర్యటించారు. ఈ పర్యటనతో యాంగోన్‌లో యూ తీయెన్‌, అంగ్‌ సాన్‌సూకీలను ఒబామా కలవనున్నారు.