మరణశయ్యపై సర్కారు చదువు… ఈ పాపం కేసిఆర్ కే దక్కుతుంది – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 18 ( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ అప్రతిష్టకు లోనవుతుందని, నేడు సర్కారు సదువు మరణశయ్యపై వేలాడుతోందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్, మరియు ఆర్ పి కాలనీ జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి పార్ట్ 2 లోని ప్రగతి నగర్, దీనబంధు కాలనీ ల లోని ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ వున్నా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు పంపించాలంటే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటున్నాయి.
 క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గి, హాజరు శాతం లేక కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతుండగా, మరి కొన్ని పాఠశాలలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి ఒకప్పుడు విద్యార్థులతో కళకళలా లాడిన పాఠశాలలు, నేడు సమస్యలతో కళకళలాడుతున్నాయి, నేడు పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థిని-విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద వచ్చే బియ్యం సన్న బియ్యం అని గొప్పగా చెప్పిన ప్రభుత్వం తీరా చూస్తే ఇక్కడ పురుగులు పట్టి ముక్తి పోయి ఉన్న బియ్యన్ని చూస్తే అర్థం అయింది మన ప్రభుత్వ పాఠశాలల దుస్థితి.పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా.. కనీస సౌకర్యాలైన టాయిలెట్స్ కూడా లేకపోవడంతో.. ఆరుబయటే కాలకృత్యాలు చేయాల్సి వస్తోందని స్టూడెంట్స్ వాపోతున్నారు.రానురాను ప్రభుత్వ పాఠశాలలు అగమ్యగోచరంగా మారుతుండడంతో.. విద్యార్థులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విద్య కనుమరుగవుతున్నదని.. పేరెంట్స్ ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు సర్కారు బడుల సమస్యలపై దృష్టి సారించాలని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, నర్సింగ్ , మరియు విద్య కల్పన, ఏకాంత్ గౌడ్, నరేందర్ రెడ్డి, శ్రీలత, సంధ్య, గణేష్ గౌడ్, అశోక్, రాజురెడ్డి, ప్రభాకర్ యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.