మరమగ్గాల ఆధునీకరణకు.. 

నిధులివ్వండి
– రాష్ట్రానికి కొత్తగా 10క్లస్టర్లు ఇవ్వండి
– కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి మంత్రి కేటీఆర్‌ వినతి
న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : తెలంగాణలో నూతనంగా కొత్తగా 10 చేనేత క్లస్టర్లును ఇవ్వాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌  రాష్ట్రంలో చేతనే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని కేటీఆర్‌ స్మృతిఇరానీకి వివరించారు. అనంతరం విూడియాతో మాట్లాడతూ.. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం రూ.1200 కోట్లతో బడ్జెట్‌ కేటాయించామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న క్లస్టర్లతో పాటు కొత్తగా మరో 10 క్లస్టర్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. వీటి వల్ల ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో, మహబూబ్‌నగర్‌లో పలు ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మరమగ్గాలు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన కేటీఆర్‌, 50 శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 8 వేల మగ్గాలను ఆధునికీకరణ చేస్తున్నామని, ఇందుకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి స్మృతీఇరానీ సానుకూలంగా స్పందించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.