మరికాసేటపట్లో మోడీ ప్రమాణస్వీకారం

అహ్మదాబాద్‌: ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీ నాలుగోసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన సర్దార్‌పటేల్‌ స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అద్వానీ, గడ్కరీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జెట్లీ, ముఖ్యమంత్రులు శిరాజ్‌సింగ్‌, చౌహాన్‌, రమణ్‌సింగ్‌, జయలలిత హాజరయ్యారు.