మరోమారు క్రమబద్ధీకరణ

3
– డబుల్‌ బెడ్‌రూంలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, ఆగష్టు 27 (జనంసాక్షి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణంపై  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు, పట్టణ జ్యోతిపై సమావేశంలో చర్చించారు. 590 చదరపు అడుగుల్లో బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాల్లో 5 లక్షల 4 వేలతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పేదలకు వెయ్యికి పైగా ఇండ్లను నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7 లక్షల 4 వేలు వ్యయం కానున్నట్టు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఉన్నచోట ఇళ్ల నిర్మాణం చేపడతారు. హైదరాబాద్‌లో మరోసారి ఇళ్ల క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్‌ కాలనీలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన మంత్రులు, అధికారులతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సవిూక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలో గృహ నిర్మాణం, క్రమబద్దీకరణ, నగర సమస్యలపై చర్చించారు.