మరోమారు గెలిపించండి: చింత ప్రభాకర్‌

సంగారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ప్రపంచ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో చేపడుతున్న పథకాల రూపశిల్పి మన కేసీఆర్‌ అని సంగారెడ్డి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి చింతా ప్రభాకర్‌ అన్నారు. కెసిఆర్‌ పథకాలే తెలంగాణకు ఓరామరక్ష అన్నారు. మరోమారు గెలిపించి ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు కల్పించాల్సిందిగా నియోజకవర్గ ప్రజలను కోరారు. పలుప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేశారు. సీఎం అందిస్తున్న ప్రోత్సాహం, ఇస్తున్న చేయూతతో మంచినీటి సమస్యను పరిష్కారించుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా ప్రతి ఎకరాకు పారించి కరువును శాశ్వతంగా పారదోలడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను నూటికి నూరు శాతం లబ్దిదారులకు అందేలా చూస్తామన్నారు. పెద్ద మనసుతోని దీవించి కారు గుర్తుకు ఓటేసి విూకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.