మరోమారు గెలిపించి అభివృద్దికి చేయూతనివ్వండి: కోం కనకయ్య

కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇల్లెందు రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోం కనకయ్య పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు టేకులపల్లి మండలానికి తన కృషి వల్లే వచ్చిందనిస్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో శాశ్వతమైన పథకాలు , అభివృద్ధి కావాలంటే మరోసారి

కేసీఆర్‌ను సీఎం చేసుకోవాలని అన్నారు.కేసీఆర్‌ను విమర్శించడానికే తప్ప అభివృద్ధి కోసం స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఏనాడు పాటుపడలేదన్నారు. ప్రజలకు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. పనుల కోసం నియోజక వర్గానికి నిధులు కావాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏనాడు కోరలేదన్నారు. అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపించుకోవాలే తప్ప ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ఇల్లెందును మరింత అభివృద్ధి పరిచేందుకు ఎటువంటి అభివృద్ధి పథకాలు కావాలన్నా ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కారు గుర్తుకు ఓటువేసి గెలిపిస్తే ప్రజలకు గెలిచిన అభ్యర్థితో ప్రజలకు జీతం చేసేలా ఉంచి ఈ ప్రాంత ఓటర్ల రుణం తీర్చుకుంటామన్నారు. అభివృద్దిని చూసి అనేక మంది వేరే పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ సీఎం అయిన వెంటనే రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాటుపడ్డామన్నారు. మరోమారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషిచేస్తానన్నారు.