మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం
-మంత్రి జానారెడ్డి
హైదరాబాద్ : పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలే గ్రామరాజ్యానికి పునాధి అని మంత్రి జానారెడ్డి అన్నారు. రిజర్వేషన్ల ఇబ్బంది వల్లే స్థానికి సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ విస్తృతస్థాయి సదస్సులో జానారెడ్డి ప్రసంగించారు. మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, అగస్టులో జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని కోరారు.