మరో రికార్డు నమోదు చేసిన బంగారం ధర
ఢిల్లీ: బంగారం ధర మరోసారి రికార్డు తిరగరాసింది. సోమవారం వంద రూపాయలు పెరిగి 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,950 పలికింది. గత సెప్టెంబర్ 14న బంగారం రూ. 32,900లు పలికి రికార్డు ధర నమోదు చేయగా ఈ రోజు ఆ రికార్డును అధిగమించింది. వెండి ధర కిలో రూ. 63,200 పలికింది.