మరో రెండ్రోజులు భారీ వర్షాలు

 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలు సహా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం ఖమ్మం జిల్లాలో కోయిదాలో అత్యధికంగా 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా భువనగిరిలో 7.7, హన్మకొండ 7.5, బూర్గంపాడులో 7.2, శాయంపేటలో 6.7, అశ్వారావుపేటలో 6.3, హసన్‌పర్తిలో 6.2, పినపాకలో 6.0, ధర్మాసాగర్‌, జుక్కల్‌లో 5.3 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.