మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వడగాలులు
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల48 గంటల వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని భాతర వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ, వాయువ్వ దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాల్లో అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉంటుదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.