మర్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మర్పల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన టిఆర్ఎస్ నాయకులు. శుక్రవారం రోజున పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, పి.ఎ.సిఎస్ వైస్ చైర్మన్ పసియోద్దీన్, బంటు రమేష్, మాజీ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సురేష్, ఉగ్గేల్లి రవీందర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.