మర్యాల హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఫోటో రైటఫ్ గురువులకు సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు
భువనగిరి / బొమ్మలరామారం. జనం సాక్షి
బొమ్మలరామారం మండలంలోని మర్యాల హైస్కూల్ లో
1991_1992 సంవత్సరం విద్యను అభ్యసించిన
పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని పూర్వ విద్యార్థి గ్రామ సర్పంచ్ కురిమిళ్ళ దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులు అయిన పి నాందేవ్, కూరపాటి నరేందర్, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచార్యులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కురిమిళ్ళ దామోదర్ గౌడ్ మాట్లాడుతూ
ఒకే గొడుగు కింద చదువుకున్న నాతోటి పూర్వ విద్యార్థులకు సమ్మేళనంలో కలుసుకున్నందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి ఆత్మీయ అభివందనములు తెలిపారు. పాఠశాలలో చదువుకున్న రోజులలో జ్ఞాపకాలను ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోసం ఆయా ప్రాంతాలలో జీవితాన్ని కొనసాగిస్తూ మనుషులు దూరమైన మమతలు కలిసే ఉంటాయని అన్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో విద్యార్థులు యోగక్షేమాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థి దశలో గురువులకు విద్యార్థులకు అభినావ సంబంధాలను పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థుల నైపుణ్యాలను గుర్తు చేశారు.
భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారాన్ని అందించాలని సూచించారు. అందుకుగాను సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముద్దం రాజ నారాయణరెడ్డి, ముద్దం ధర్మారెడ్డి, వడ్లకొండ కొండల్, కొత్తూరు శీను, ఫకీర్ శ్రీధర్ రెడ్డి, బాలగంగాధర్ రెడ్డి, రామ్ రెడ్డి,కృష్ణ, స్వామి, నరసింహ,చిలుకయ్య,పోషయ్య, ఉమారాణి, షర్మిల, ధనమ్మ, మంజులబాయ్, విజయ, మాధవి పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.