మలి విడత ఎన్నికలు 4న

ఆదిలాబాద్‌, జనవరి 31 (): సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 4న జరగనున్న  మలి విడత ఎన్నికల్లో 343 ప్రాదేశిక నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. మలి విడతలో 39 సహకార సంఘాలలోని 507 ప్రాదేశిక నియోజకవర్గాలలో 142 స్థానాలలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడంతో  మిగిలిన 343 స్థానాలకు ఫిబ్రవరి 4న పోలింగ్‌ జరగనున్నది. ఆదిలాబాద్‌ డివిజన్‌ పరిధిలోని రెండవ విడతలో భాగంగా 17 సంఘాలలోని 215 స్థానాలకు గాను 81 ఏకగ్రీవంగా కావడంతో మిగతా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిర్మల్‌ డివిజన్‌లోని 8 సంఘాల పరిధిలో 104 స్థానాలకు గాను 16 స్థానాల్లో ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో 88 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మంచిర్యాల డివిజన్‌లో 14 సహకార సంఘాల్లోని 182 స్థానాలకు గాను 45 స్థానాలలో ఏకగ్రీవం కాగా 137 ప్రాదేశిక నియోజకవర్గాలలో  ఫిబవ్రరి 4న ఎన్నికలు జరగనున్నాయి.