మలేషియా విమానాన్ని కూల్చింది రష్యానే !

– వెల్లడించిన ఆస్టేల్రియన్‌ ఏఎఫ్‌పీ కమాండర్‌ జెన్నిఫర్‌ హాస్ట్‌
మస్టర్‌డ్యామ్‌ , మే24(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల క్రితం 298 మంది ప్రయాణికులతో వెళ్తోన్న మలేషియా విమానం కూలిన ఘటనలో అధికారులు దర్యాప్తును పూర్తి చేశారు. దానికి సంబంధించిన వివరాలను గురువారం నెదర్లాండ్స్‌లో వెల్లడించారు. ఎంహెచ్‌17 విమానాన్ని.. రష్యా మిస్సైల్‌ కూల్చివేసిందని దర్యాప్తు అధికారులు తేల్చేశారు. 53వ రష్యా మిలిటరీ బ్రిగేడ్‌ నుంచి ఆ క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపారు. 2014, జూలై 17న మలేషియా విమానం కూలిన ఘటనలో 298 మంది మృతిచెందారు. ఆ విమానాన్ని ఉక్రెయిన్‌ గగనతీరంలో కూల్చేశారు. ఎంహెచ్‌17 విమానాన్ని .. రష్యా మిస్సైల్‌ ఎలా కూల్చిందన్న అంశాన్ని ఆస్టేల్రియన్‌ ఏఎఫ్‌పీ కమాండర్‌ జెన్నిఫర్‌ హాస్ట్‌ గురువారం అంతర్జాతీయ విూడియా ముందు వెల్లడించారు. ఆ ప్రమాదంపై జరిగిన దర్యాప్తు వివరాలను ఆమె సమగ్రంగా వివరించారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను తాము సేకరించినట్లు ఆమె తెలిపారు. కస్క్‌ నగరం నుంచి రష్యా మిస్సైల్‌ వచ్చినట్లు డచ్‌ నిపుణులు తేల్చారు. అమస్టర్‌డ్యామ్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్తున్న సమయంలో విమానాన్ని పేల్చేశారు.
—————————-