మల్లన్నజలాశయం జాతికిఅంకితం
` మల్లన్నసాగర్ జనహృదయసాగర్
` ఎక్కడ కరువున్నా..తెలంగాణలో ఉండదు
` కాళేశ్వరం ఎత్తిపోతలతో మారిన ముఖచిత్రం
` మల్లన్నసాగర్ అతిపెద్ద జలాశయంగా నిర్మాణం
` ఎందరో అడ్డుపడ్డా జలాశయాన్ని పూర్తిచేసుకున్నాం
` వేలాదిమంది కార్మికులు..వందల మంది అధికారుల శ్రమకు ప్రతిరూపం
` మంత్రి హరీష్‌రావు శ్రమ కూడా మరువలేనిది
` పరిహారంలో అన్యాయం జరిగిన వారి కోసం మరో రూ.100కోట్లు
` పర్యాటక ప్రాంతంగా అద్భుత అవకాశాలు ఉన్నాయి
` మల్లన్నసాగర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
` గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్నకు ముఖ్యమంత్రి జలాభిషేకం
సిద్దిపేటబ్యూరో,ఫిబ్రవరి 23(జనంసాక్షి):ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేశంమొత్తం కరువున్నా..ఇక తెలంగాణలో మాత్రం కరువుఛాయలే రావని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరా యంగా జలాలను అందిస్తుందని అన్నారు. ప్రాజెక్టులతో పాటు,చెరువులను,కుంటను నింపుకోవడంతో ఇక వ్యవసాయానికి కూడా ఢోకా ఉండబోదన్నారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో కొందరికి నష్టపరిహారంలో ఇంకా అసంతృప్తులు ఉన్నాయని అన్నారు. ఎందరో త్యాగంచేసి భూములు అందించారు. కొన్ని గ్రామాలను కోల్పోయాం. అలాంటి వారికి ఇంతపెద్ద ప్రాజెక్టు సందర్భంగా వారు దుఃఖించడం సరికాదు. మరో వంద కోట్లు అయినా ఫర్వాలేదు. అలాంటి వారికి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో అదో చిన్న మొత్తమేనని అన్నారు. వారు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉందన్నారు. మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నాం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టంగా అభివర్ణించారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 58 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆ సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢల్లీిలో ఉన్నాను. అక్కడ్నుంచే మన రాష్ట్ర చీఫ్ జస్టిస్‌కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 600 పైచిలుకు కేసులు వేశారు. ఇంజినీర్లు పదవీ విరమణ పొందినా కూడా ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు. ఇంజినీర్లు అందరికీ సెల్యూట్. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం. ఎంతో మనసు పెట్టి ముందుకు పోయాం. హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా పని చేశాం. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జన హృదయం సాగరం అన్నారు. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇక బోర్లలో నీరు ఉండదనే సమస్యరాదన్నారు. చిన్నిచిన్నపొరపాట్లు జరిగినా ప్రాజెక్టును అనుకున్న లక్ష్యంతో ముందుకు సాగామన్నారు. ఇటు మల్లన్న సాగర్ వద్ద దుబాయ్ బురుజును మించేలా ఇక్కడ కలర్ ఫౌంటేన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ మల్లన్నసాగర్, పక్కనే కొమురవెల్లి మల్లన్న, మరోవైపు యాదాద్రి నిర్మాణంతో ఈ ప్రాంతం అద్భుతంగా ఉండబోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయ్ అయిన మల్లన్న సాగర్ లోకి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటిని రిలీజ్ చేశారు. రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ కు 5 తూములు(స్లూయిజ్ లు) ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు, సింగూర్ ప్రాజెక్టుకు, తపాస్ పల్లి రిజర్వాయర్ కు,మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం16 టీఎంసీలు వాడుతారు.
కొమురవెల్లి మల్లన్నకు ముఖ్యమంత్రి గోదారిజలాభిషేకం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని స్వామివారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్నసాగర్ గోదావరి జలాలతో మల్లన్నకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి హరీష్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కొమురవెల్లిలోని స్వామివారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి పేరు విూదుగా తుక్కాపూర్‌లో 50య టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేలా రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని సీఎం హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి. మిగతా రాష్టాల్లో ఉన్న పరిస్థితులు, తెలంగాణలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. పంటలు పండిరచే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రావిూణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది. కుక్కలు మొరుగుతున్నాయని మన పనిని ఆపొద్దు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా రాష్టాన్న్రి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మన పథకాల గురించి తెలుసుకున్నారు. దేశానికే మార్గదర్శకంగా, గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. పిడికెడు మందితో నేనొక్కడినే బయటకు వచ్చి తెలంగాణను సాధించాం. భారతదేశమే అబ్బురపడే విధంగా తెలంగాణలో అభివృద్ధి ఆవిష్కృతమైంది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో అంటు రోగాలు మాయం అయ్యాయి. మాతాశిశుమరణాలు తగ్గిపోయాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. కేసీఆర్ కిట్లు 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయ్యాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అవుతోంది. బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం. అనేక రంగాల్లో పురోగమిస్తూ ముందుకు పోతున్నాం. కొంతమంది అవకాకులు చెవకాకులు పేలిన మనం ముందుకెళ్లాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.మల్లన్న సాగర్ తెలంగాణకే తలమానికం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు ఆగలేదని, ప్రాజెక్టుపై వందలాది కేసులను సుప్రీంకోర్టు కోట్టేసిన రోజని అన్నారు. దేశంలో నదిలేని చోట ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన ఉద్యమనాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఎక్కడైనా నదికి అడ్డంగా రిజర్వాయర్లను నిర్మిస్తుంటారు. కానీ నది ప్రవాహం లేని చోట.. దేశంలో ఎక్కడా లేనివిధంగా జలాశయాన్ని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్.. నదికే కొత్త నడక నేర్పారు. బీడువారిన తెలంగాణ బతుకుల బాధ తీర్చారని మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణకు నడిగడ్డలో మల్లన్నసాగర్‌ను నిర్మించారని.. ఇక్కడినుంచి ఏ మూలకైనా నీళ్లు వెళతాయని చెప్పారు. 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేలా మల్లన్న సాగర్ నిర్మాణం జరిగిందన్నారు. ఈ రిజర్వాయర్‌తో సగం తెలంగాణ సస్యశామలంగా మారుతుందని వెల్లడిరచారు. సీఎం కేసీఆర్ ఓ ఇంజనీర్‌లా వ్యవహరించి.. గోదావరి నీరు సముద్రంలో కలవకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములకు మళ్లించారని గుర్తుచేశారు. ఈ రిజర్వాయర్‌కు పునాది వేసినపుడు నీళ్లేరావని.. కలలో కూడా కట్టరని విమర్శలు చేశారని మంత్రి అన్నారు.ఆ విమర్శలకు తమ పనితనమే సాక్ష్యమన్నారు.
(దేశం దారితప్పుతోంది…చక్క దిద్దుకోవాలి
కేంద్రంలో మంచిప్రభుత్వం ఉంటేనే సాధ్యం
అందుకే జాతీయ రాజకీయలపై దృష్టి పెట్టా
శక్తి మేరకు కేంద్రంలోనూ మంచి ప్రభుత్వం కోసం కృషి
మల్లన్న సాగర్ సభలో స్పష్టం చేసిన సిఎం కెసిఆర్)
సిద్దిపేటబ్యూరో,ఫిబ్రవరి 23(జనంసాక్షి): దేశం దారితప్పుతోందని, దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కర్ణాటకలో దిక్కుమాలిన మతకల్లోలం లేపారని అన్నారు. కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉండాలని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రభుత్వాలు వద్దని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సిఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకుచ్చిన శర్వశక్తులు, సకల మేథోసంపత్తిని ఉపయోగించి, చివరి రర్తం బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. దేశం కూడా దారి తప్పి పోతోంది. చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. దేశంలో ఉన్నం కాబట్టి వంద శాతం మనం ముందుకు పోవాలి. అసహ్యం పుట్టే పనులు జరుగుతున్నాయి. మతకల్లోలాల పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. పిల్లలకు కర్ణాటక వెళ్లి చదువుకోవాలంటే భయపడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలి. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి లక్షా 50 వేల కోట్ల సాప్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్రతి రోజూ 580 వరకు విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. తెలంగాణలో ఎక్కడా పోయినా ఎకర భూమి 20 లక్షలకు పైగానే ఉంది. మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్టాల్రు బాగు పడాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలి. కులాలు, మతాల పేరు విూద చిచ్చు పెట్టొద్దు. ప్రశాంత వాతావరణంలోనే పరివ్రమలు వస్తాయి. మతకల్లోలాల ఉంటే పరిశ్రమలు రావు. మతకల్లోలాలు చాలా దుర్మరార్గం.. ఇవి దేశానికి ప్రమాదం, మంచిదికాదు. దాన్ని సంహించకూడదు. ఆ క్యాన్సర్‌ను విసర్తించకుండా చర్యలు చేపట్టాలి. ఈ దేశం నుంచి ఎక్కడికక్కడనే తరిమికొట్టాలి. ప్రజల కోసం పని చేయాలి. ప్రజలకు చేటు చేసే వారిని నిలదీసి ఎదుర్కోవాలి. క్షమించి ఊరుకోవద్దు. మనందరం పురోగమించాలి. అంఉదకే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని కెసిఆర్ అన్నారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకుచ్చిన శర్వశక్తులు, సకల మేథోసంపత్తి ని ఉపయోగించి, చివరి రర్తం బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతాను ముందుకు పోతాను అని కేసీఆర్ స్పష్టం చేశారు