మల్లన్నసాగర్‌తో రెండుపంటలకు నీరు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్‌ ఉండదని, నక్సలిజం ప్రబలుతుందని చెప్పినవారంతా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ అన్నారు. గోదావరి జలాలను పంపించే మల్లన్నసాగర్‌ పనులను రైతులు ప్రత్యక్షంగా చూసేందుకు, నియోజకవర్గం నుంచి 200 నుంచి 300 మంది రైతులను ఫిబ్రవరి రెండో వారంలో తీసుకెళ్తానని అన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా మల్లన్నసాగర్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మల్లన్నసాగర్‌తో గోదావరి జలాలు నిజాంసాగర్‌ ఆయకట్టు అంది సస్యశ్యామలం కా నుందనిఅన్నారు. మల్లన్నసాగర్‌ పూర్తయిన తర్వాత నిజాంసాగర్‌ ఆయకట్టులో రెండు పంటలకు పుష్కలంగా నీరు అందుతుందని ఆయన పేర్కొన్నా రు. టీఆర్‌ఎస్‌ పాలనలో రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. జిల్లాకు గతంలో రైతులు గోదాంలు లేక అనేక ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గోదాంలతో రైతుల పంటకు భద్రత ఏర్పడిందని, గిట్టుబాటు ధరలు వచ్చేవరకు పంటలను నిల్వ చేసుకోవచ్చని అన్నారు.