మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం

రాజస్థాన్‌లో ఒకరి మృతి

అప్రమత్తమైన వైద్యాధికారులు

జయపురం,జూలై11(జ‌నం సాక్షి): కొరాపుట్‌ జిల్లాలో మరోసారి ఆంత్రాక్స్‌ మహమ్మారి తలెత్తుతోంది. లక్ష్మీపూర్‌ సమితిలో ఆ వ్యాధి సోకి ఒక వ్యక్తి మరణించాడు. లక్ష్మీపూర్‌ సమితి దెలిఅంబ గ్రామానికి చెందిన బామన మండియ (55) అనే వ్యక్తి ఆంత్రాక్స్‌తో మంగళవారం మరణించాడు. బామన మండియకు వ్యాధి సోకడంతో శుక్రవారం లక్ష్మీపూర్‌ ప్రభత్వ హాస్పిటల్‌లో చేర్చారు. పరీక్షించిన డాక్టర్లు ఆంత్రాక్స్‌ సోకినట్లు గుర్తించారు. అయితే ఆంత్రాక్స్‌కు చికిత్స చేసేందుకు అవసరమైన మందులు, సౌకర్యాలు లేక పోవడంతో కొరాపుట్‌లో గల సహిద్‌ లక్ష్మణ్‌నాయక్‌ వైద్య కళశాల ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండియ మరణించాడు. ఆ గ్రామంలో చనిపోయిన పశువు మాంసం తింటున్నారని అందువల్లనే ఆంత్రాక్స్‌ వ్యాధి సోకినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.

వర్షాలు పడడం వల్ల పలు వ్యాధులకు పశువులు గురవుతూ మరస్తున్నాయని వాటి మాంసాన్ని ప్రజలు తినడం వల్ల ఆంత్రాక్స్‌ వ్యాధి ప్రబలుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.