మళ్లీ ఆడపిల్లే పుట్టిందని…

హైదరాబాద్‌ : మళ్లీ ఆడపిల్లే పుట్టిందని ఆ శిశువును వదిలించుకోజూశారు తల్లీకూతుళ్లు, పుట్టి నాలుగు రోజులు గడకముందే పసిబిడ్డను నాలాలో పడేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించిన పసిబిడ్డ అమ్మమ్మను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. మీర్‌పేటకు చెందిన గోవిందమ్మ కూతురు శైలజ జడ్జీఖానా ఆస్పత్రిలో ప్రసవించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలుండగా మళ్లీ ఆడపిల్లే పుట్టింది. దాంతో గోవిందమ్మ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తలకు గాయాలైన పసిబిడ్డను నీలోఫర్‌కు తరలించారు.