మళ్లీ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌

హైదరాబాద్‌ : పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్‌ డిమాండ్‌ మళ్లీ ఎగబాకుతుంది. అత్యవసర సమయాల్లో జల విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నెల మొదట్లో రొజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 250 మి.యూ. లోపు ఉండగా ప్రస్తుతం 264 మి. యూనిట్లకు పెరిగింది. విద్యుత్‌ అందుబాటు మాత్రం 215మి.యూ ఉంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తు తుండడంతో ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడుతోంది. సీజన్‌లో ఈ కేంద్రాల ద్వారా 105మి.యూ. వరకూ ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం 87మి.యూ. ఉత్పత్తి చేస్తున్నారు. రాత్రి వేళల్లో హైడర్‌ విద్యుత్తు 14 మి.యూ. వరకు ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతర సరఫరా చేయాలంటే 11,348 మెగావాట్ల విద్యుత్‌ అవసరం.