మళ్లీ మొదటికి వచ్చిన పోలవరం

చంద్రబాబు అవినీతిపైను నేతల ఫోకస్‌

ప్రాజెక్ట్‌ పూర్తి చేయించే ప్రయత్నాల్లో లోపం

విజయవాడ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఎపిలో మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. సిఎం జగన్‌ తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. నిధులు విడుదల చేసి ప్రాజెక్ట్‌ పూర్తయ్యేలా చూడాలన్నారు. మరోవైపు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అలాగే దీని అలక్ష్యానికి చంద్రబాబుదే కారణమని అన్నారు. మాజీ ఎంపి ఉండవల్ల అరుణ్‌ కుమార్‌ మరో ఆసక్తికర విసయం తెలిపారు. కేంద్రం నుంచి ప్రాజెక్ట్‌ నిర్మాణం తసీఉకోవడం తప్పన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే పోలవరం బాధ్యతను కేంద్రంపైకి నెట్టేస్తే బాగుండేదన్నారు. అయితే ఇవేవీ చేయకుండా కాంట్రాక్టర్‌ను మార్చడం ద్వారా స్వప్రయోజనాలు ఆశించారన్న విమర్శలు వచ్చాయి. ఇకపోతేవైకాపా ప్రభుత్వ ఆలోచనలకు, కేంద్ర ఆలోచనలకు మధ్య పొంతన కుదరడం లేదు. అలాగే లెక్కల్లో కూడా పొంతన లేదు. దీంతో రాష్ట్రం సమర్పించే లెక్కలపై కేంద్రం సుముఖంగా లేదు.గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, గత ఏడాదిన్నరగా జగన్‌ ప్రభుత్వం పనులు వేగంగా చేస్తున్నట్టు చెబుతూనే వున్నా పనుల మాత్రం క్షేత్రస్థాయిలో జరగడం లేదు. చంద్రబాబు కేంద్రాన్ని కాదని ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినప్పుడే దీనికి కాలయాపన తప్పదన్న భావన ఏర్పడింది. కేంద్రం చేపట్టి ఉంటే ఈ ఆరేళ్లలో ప్రాజెక్ట్‌ పనులు పూర్తయ్యేవి. మరోవైపు నిధుల పీటముడి మరింత బిగియడంతో కేంద్రం ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు ఇస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోలవరం నిర్మాణంపై 2014 అంచనా ప్రకారం 20 వే కోట్ల పైచిలుకు ఖర్చులో ఇచ్చింది పోను ఇంకా నాలుగు వేల కోట్టు మాత్రమే వస్తాయంటున్నది.తర్వాత పెరిగిన ఖర్చుతో తమకు సంబంధం లేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. నిర్వాసితులవుతున్న లక్షలాది మంది గిరిజనులు ఇతర పేదల పట్ల అటు కేంద్రం ఇటు రాష్ట్రం నిర్లక్ష్య వైఖరినే కొనసాగిస్తున్నాయి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం బాధ్యతతో నిర్మిస్తామని విబజన చట్టంలో పేర్కొంది. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేకంగా హావిూ ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎలో బాగస్వామిగా టిడిపి, రాష్ట్రంలో దాని నాయకత్వంలో బిజెపి అధికారం పంచుకున్నా పోలవరం అడుగు ముందుకు పడ లేదు. ప్రతిపక్షాల విమర్శలు ప్రజా సంఘాల ఆందోళన తర్వాత 2016 చివరలో మళ్లీ హడావుడి పెరిగింది. జలవనరుల మంత్రిత్వశాఖ నుంచి 2016 డిసెంబరు 23న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎడబ్ల్యుడిఎ)కు పంపిన వర్తమానంలో నీటిపారుదల వ్యయానికి మాత్రమే పరిమితమై వాస్తవిక ప్రగతి ఆధారంగా తనిఖీ జరిగి సర్టిఫికెట్టు వచ్చాకే చెల్లింపు చేయాలని స్పష్టంగా వుంది. కేబినెట్‌ ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్మాణం పూర్తికావాలని చెప్పింది. నిధులు అందిన తర్వాత 18 మాసాలలోగా ఆడిట్‌ నివేదిక అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ఫ్రభుత్వం విూద ఉంటుంది. ముందుగా అనుమతి తీసుకోకుండా వ్యయం పెంచడం అనుమతించబడదు. అప్పుపై వడ్డీలు కట్టాల్సి వుంటుంది గనక సరిగ్గా సమయంలోనే నిధులు విడుదలఅవుతాయని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే పేరుతో 2017 మార్చి 15న కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయంలోనూ ఈ విషయం స్పష్టంగా వుంది. కాంగ్రెస్‌లోనూ టిడిపిలోనూ ఎంపిగా వున్న రాయపాటి సాంబశివరావు రష్టాకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ అనే కంపెనీతో ముడి వేసుకుని అంతర్జాతీయ కోటాలో టెండరు సంపాదించారు గాని పని మాత్రం చెల్లింపు రాలేదంటూ మందకొడిగా నడిపించారు. లాభదాయకంగా చేయగలిగిన మట్టిపని కాంక్రీటు దశకు వచ్చేసరికి చేతులెత్తేశారు. వారిని మార్చడానికి కేంద్రం ఒప్పుకోలేదని సబ్‌ కాంట్రాక్టరును నియమించేందుకు రాష్ట్ర కబినెట్‌ నిర్ణయం చేసింది. దీనిపై ప్రత్యేకంగా చంద్రబాబు నాసిక్‌ వెళ్లి కేంద్ర నీటిపారుదల మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడివచ్చారు.ఈ ప్రాజెక్టు వల్ల ప్రచారం వస్తుంది గనక పాత రేటుకే చేసేందుకు నవయుగ ఒప్పుకుందని చంద్రబాబు ధన్యవాదాలు చెప్పినా విద్యుత్‌ కేంద్ర నిర్మాణంలో ఎక్కువ లాభం వచ్చేలా ఏర్పాటు జరిగింది. ఇక అధికారం చేపట్టిన జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రహసనం మరోలా వుంది. అన్ని అంశాల్లో టిడిపిని విమర్శించిన వైసీపీ నేతలు పోలవరం నిధు విడుదలపై కేంద్రం సహాయ నిరాకరణ కన్నా పాత ఆరోపణలకే సమయం కేటాయించారు. కేంద్రానికి వినతులు ఇస్తూనే అప్పటి వరకూ జరిగింది కేవలం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ పోవరంలోనవయుగను తప్పించి మెఘా కంపెనీకి అంతకు ముందు కన్నా తక్కువకు కాంట్రాక్టు ఇచ్చారు. దీనిపై నవయుగ కోర్టుకు వెళ్లినా అనుకూల తీర్పు రాలేదు. విద్యుత్‌ ప్రాజెక్టు, డ్యాం నిర్మాణంలో మొత్తం 800 కోట్టు రివర్స్‌ ద్వారా మిగిల్చినట్టు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలమంతా కేంద్రం లేవనెత్తిన ఆభ్యంతరాలను పైకి చెప్పకుండా అనుకూల ప్రచారం చేసుకుంది. అరకొరగా విదిలించిన నిధులను చూపించడంపైనే కేంద్రీకరించింది.2019 డిసెంబరులో లోక్‌సభలో సంబంధిత మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ 2014 నాటి అంచనా మేరకు నిర్మాణవ్యయానికే తాము కట్టుబడివున్నామని రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం పూర్తి చేస్తే నిర్మాణం అయిపోతుందని చల్లగా చెప్పారు. మొత్తం లక్షా 5 వేల కుటుంబాలకు పునరావాసం అవసరం కాగా ఇప్పటికి 3422 కుటుంబాకే జరిగినట్టు కూడా మంత్రి ప్రకటించారు. పైగా సెప్టెంబరులో తమ ప్రతినిధి వర్గం కలిసినప్పుడు 47 వేల కోట్ల ఖర్చుకు కేంద్రం ఒప్పుకున్నట్టు కూడా ఇప్పటికీ నీటిపారుదల మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెబుతున్నారు. వాస్తవం ఏమంటే అవన్నీ జల్‌శక్తి శాఖ చెప్పినవి తప్ప ఆర్థిక శాఖ ఆమోదం రాలేదు. ముఖ్యమంత్రి కూడా కేంద్రంతో ఘర్షణ పడకుండా చర్చతో 47వేల కోట్ల మొత్తం రాబట్టాని అధికారులకు సూచించారు. ఈ సమయంలో జరగాల్సింది అన్ని పార్టీలు సంఘాలు కలసి కేంద్రంపై వత్తిడి తేవడం తప్ప టిడిపి వైసీపీలు తమను తాము పొగుడుకుంటూ అవతలి వారిని నిందించినందువలన ఒరిగేది లేదని మేధావులు అంటున్నారు.