మస్కట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి మృతి

ఎల్లారెడ్డిపేట : కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన నలిమేటి రాజయ్య(49) నాలుగు రోజుల క్రితం మస్కట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. అతని మృతదేహం ఈరోజు స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గత 20 సంవత్సరాలుగా మస్కట్‌లోని ఓ ఆసుపత్రిలో కార్మికుడిగా పనిచేస్తున్న రాజయ్య విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య నరసవ్వ, ఇద్దరు పిల్లలున్నారు.