మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శం

బిచ్కుందల అక్టోబర్ 28 (జనంసాక్షి)

మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శమని బిచ్కుంద వాల్మీకి సంఘం సభ్యులు అన్నారు. శనివారం మండలకేంద్రంలో గల వాల్మీకి గుడి వద్ద వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం సభ్యులు కలిసి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం వేట గాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి దారి దోపిడీలు చేశారని, ఆ తర్వాత నారద మహా ముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత రామాయణ కావ్యాన్ని రచించారని చెప్పారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించింది వాల్మీకి మహర్షి అని వారు గుర్తు చేశారు. వాల్మీకి మహర్షి జీవితం మానవులకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని ముందు తరాలకు తెలియజేయాలని, కృషి ఉంటే మనుషులు మహర్షులవుతారని, వాల్మీకి మహర్షి చరిత్ర ఇందుకు నిలువెత్తు నిదర్శనమని వివరించారు. కార్యక్రమంలో అశోక్ పటేల్, నాల్చర్ రాజు, ఎంపీడీవో ఆనంద్, మహబూబ్, ఉప సర్పంచ్ నాగరాజు, డాక్టర్ రాజు, సంజు పటేల్, మార్కేట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.