మహాకూటమిని ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌కు ఓటేస్తే 60 ఏళ్ల వెనక్కి వెళతాం: మదన్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహకుటామిని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదుని నర్సాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి

మదన్‌ రెడ్డి తేల్చి చెప్పారు మహకుటామి పేరుతో కాంగ్రెస్‌ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా టీఆర్‌ఎస్‌ పార్టీ

గెలుపును అపాలేరని అన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దుసుకుపోతుంది. నర్సాపూర్‌ నియోజకవర్గం అభ్యర్ధి చిలుముల మదన్‌ రెడ్డి హత్నూర మండలంలో ఇంటి పలు గ్రామాల్లో ఇంటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా నర్సాపూర్‌ నియోజకవర్గంలో సుధీర్ఘ కాలంగా ఉన్న పలు సమస్యలు పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. గత నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ తమ పార్టీని అధికారంలోకి తీసుకవస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ అనేక సం క్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో

నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రంగా నిలిచిందనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూపు రేఖలు మార్చామని చెప్పారు. పార్టీలో చేరిన వారంతా ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. తప్పిపోయి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధిలో 60 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సి వస్తుందనీ, తెలంగాణ పరిస్థితి అధోగతి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులను కలుస్తూ కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రజలే బుద్ధి చెప్పాలనీ, తెలంగాణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదరించాలని కోరారు.