మహాకూటమిని మట్టి కరిపిస్తాం

నామినేషన్ల ప్రక్రియతో జోరు పెంచిన టిఆర్‌ఎస్‌

వెనక్కి తగ్గని కూటమి అభ్యర్థుల ప్రచారం

ఖమ్మం,నవంబర్‌12(జ‌నంసాక్షి): నోటిఫికేషన్‌ విడుదలతో ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు జోరు పెంచారు. నామినేషన్ల దాఖలుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అలాగే ప్రచారంలోనూ దూసుకుని పోతున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదపడతాయని, దీనిద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి తీరుతామని మాజీమంత్రి జలగం ప్రసాదరావు, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయబాబు అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 24గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, బీమా, గొర్రెలు, చేపలు పంపిణీల ద్వారా రైతులు, కుల సంఘాల్లో ఆత్మైస్థెర్యం నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా రూ.1.16లక్షలు అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, డీసీసీబీ చైర్మన్‌, అభ్యర్థి పిడమర్తి రవి, డాక్టర్‌ మట్టా దయానంద్‌లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపునకు పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన సత్తుపల్లి నియోజకవర్గంలో పిడమర్తి రవి గెలుపు భారీ మెజార్టీగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కల్లూరు మండలములోని టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బత్తులపల్లి,కప్పలబంధం గ్రామాలలో రోడ్‌ షో నిర్వహించారు. బత్తులపల్లి రామలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మాజీమంత్రి జలగం ప్రసాదరావు డి.సి.సి.బి. చైర్మన్‌ మువ్వ విజయబాబు,అభ్యర్థి పిడమర్తి రవి పాల్గొని ప్రచారం చేశారు.ఈ సందర్భంగా పూల జల్లులు కురిపించి,పులదండలతో శాలువలతో ఘనస్వాగతం పలికారు. కారు గుర్తు కు ఓటు వేసి పిడమర్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ డాక్టర్‌ లక్కినేని రఘు,మండల అధ్యక్షుడు పాలెపు రామారావు,కట్టా అజయ్‌ కుమార్‌, పసుమర్తి చందరరావు, తోటకూర శేషగిరిరావు, కొండపల్లి వాసు,కత్తి కృష్ణారెడ్డి,నందిగామ ప్రసాద్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భధ్రాధ్రికొత్తగూడెం జిల్లా పినపాక నియేజక వర్గం అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర్‌లొ ఇంటి ఇంటికి ప్రచారం. ఈ ప్రచారంలొ మహాకూటమి నాయకులు మట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ అబ్యర్ది రేగా కాంతారావుకు చేతి గుర్తు పై విూ ఓటు వేసి అత్యధిక మెజారిటీ తొ గెలిపించాలని కొరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొడి అమరెందర్‌ ఏనుగుల కృష్ణా రెడ్డి మొగిళ్ళ వీరారెడ్డి .వెన్నంఅశొక్‌. దైద నారాయణ రెడ్డి. చిలకా రాంచద్రయ్య కంచుకట్ల వీరబద్రం ./ుఆఖ నుంచి తుళ్ళూరి ప్రకాష్‌ మదన్‌ లాల్‌. బొబ్బాల నాగేశ్‌. బండారి జనార్దన్‌. నేహ్రం నాని. కడగారి రామకృష్ణ. కళావతి పెద్ద

సంఖ్యలో కార్య కర్తలు పాల్గొన్నారు