మహాకూటమి పేరు చెబితేనే హడల్‌

టిఆర్‌ఎస్‌ నేతలు వణికి పోతున్నారు
రేవూరి ప్రకాశ్‌ రెడ్డి
వరంగల్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): మహాకూటమిని మాయా కూటమనో లేక కాంగ్రెస్‌ టిడిపితో ఎందుకు ప ఒత్తు పెట్టుకుందని అనే వారికి ఎన్నికల ఫలితాలతో దిమ్మ తిరిగేల ఆచేస్తామని టిడిపి  పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. కూటిమి అంటేనే ఇప్పుడు టిఆర్‌ఎస్‌ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. చంద్రబాబును ఆంధ్రా బాబు అంటూ విమర్శింస్తే ఓట్లు రాలే కాలం పోయిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా ఇంకా సెంటిమెంట్‌ పనిచేస్తుంన్న భ్రమలో టిఆర్‌ఎస్‌
ఉందన్నారు.  రైతుల గురించి గొప్పలు చెబుతున్న సిఎం కెసిఆర్‌ వారి సమస్యలపై ఏనాడు కూడా ఎందుకు చర్చించలేదని అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఒక్కసారి కూడా రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చించిన దాఖలాలు లేవన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతుబంధు పథకంతో ఎకరాకు రూ.4 వేలు చెల్లించినంత మాత్రాన రైతులకు లాభాలు ఉండవని ఆయన  చెప్పారు. బతికున్న రైతులకు మేలు చేయకుండా మృతి చెందిన తరువాత రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హావిూలను పక్కన పెట్టి రాష్ట్రంలో కుటుంబ పరిపాలన సాగుతోందని అన్నారు.  తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో పోరాడి తెలంగాణ సాధిస్తే దొరల పాలనను మరిపించేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. అందుకే కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు అన్ని పార్టీలు కలసి కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు.  పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే  పదవులు దక్కాయన్నారు. చదువుకున్న విద్యార్థులను నిరుద్యోగులుగా మారుస్తున్నారని మండి పడ్డారు. గొర్రెలు, బర్రెలిస్తూ రోజుకో విధంగా గారడి మాటలతో అసలు సమస్యలను పక్కదారి పట్టించారని అన్నారు. ఇంతకాలం  మంత్రివర్గంలో మహిళలను తీసుకోకుండా,సచివాలయానికి రాకుండా తెలంగాణలో  నియంత పాలన కొనసాగించారని ధ్వజమెత్తారు. మహిళలపై రోజుకో విధంగా దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో సామాజికంగా, ఆర్థికంగా, పేదలకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో మహాకూటమి గెలవాలని, టిఆర్‌ఎస్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాయకులు కలసికట్టుగా ముందుకు సాగుతూ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరముందన్నారు.

తాజావార్తలు