మహాత్మా గాంధీ విగ్రహం కి వినతి పత్రం అందించిన విఆర్ఏ ల మండల జెఏసి నాయకులు,
ఖానాపురం అక్టోబర్2జనం సాక్షి
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరవధిక సమ్మె 70వ రోజున దీక్షా శిబిరం లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా
గాంధీ విగ్రహానికి వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఐలేష్ పూలమాలవేసి మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం
వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఐలేష్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన వీఆర్ఏలకు పే స్కేల్, అర్హులకు ప్రమోషన్స్,55 సం నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాల పన్నెండు రోజులు గడిచినా ఇప్పటి వరకు జీఓ విడుదల చేయక పోవడమే కాక శనివారం రోజు వరంగల్ పర్యటన లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వీఆర్ఏలు ప్రతినిధులు కలిసి మాకు ఇచ్చిన హామీలు జీవోలు అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వగా వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల ముఖంపై విసిరి డ్రామాలు చేస్తున్నారా అని మాట్లాడడం సరి అయినది కాదు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా యొక్క సమస్యలు పట్టించుకోకుంటే ఇక మేము ఎవరికీ మా సమస్యలు చెప్పుకోవాలి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షుడుబిక్షపతి,ప్రధాన కార్యదర్శి రవికుమార్,జిల్లాకో-కన్వీనర్ మాధవి,గౌరవఅధ్యక్షుడు సుదర్శన్, కోశాధికారి నరసయ్య,వీఆర్ఏలు పాల్గొన్నారు.