మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులుమహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
పీవీ కాలనీ నుంచి రామానుజం వరకు ప్రత్యేక బస్సులు
ఉదయం 4 గం. నుంచి రాత్రి 9 గం. వరకు రెండు బస్సు ఏర్పాటు.
పినపాక నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మణుగూరు డిపో మేనేజర్ టి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మణుగూరు మండలం రామానుజవరంలో కొలువై ఉన్న మహాశైవ క్షేత్రం భక్తులు ఆరాధ్య దైవంగా భావించే నీలకంటేశ్వరుని దర్శించుకొనుటకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ బస్సులను శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పివీ కాలనీ నుంచి సి టైప్, హనుమాన్ టెంపుల్, ప్రభుత్వ ఆసుపత్రి, అంబేద్కర్ సెంటర్ సురక్ష బస్టాండ్ తిర్లాపురం మీదుగా రామానుజవరం వరకు వెళ్ళుటకు రెండు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనాలు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం చేసి ఇబ్బందులు పడుకుంటా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా సుఖమయంగా ఉంటుందని ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. మణుగూరు నుంచి వెళ్లి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని అన్నారు.