మహాసముద్ర లోతుల్లో చైనా రికార్డు
బీజింగ్:సముద్రాలో ఖనిజాల అన్వేషణకు ఉపయోగించే ఒక బుల్లి జలాంతర్గామి (సబ్మెర్సిబుల్) అదివారం సరికొత్త జాతియ రికార్డును స్థాపించింది.ముగ్గురు ‘ఓషనాట్ల’తో పసిఫిక్ మహాసముద్రంలో 7వేల మీటర్లు లోతుకు చేరింది.రోదసిలో ఉన్న ముగ్గురు చైనా వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలిపారు.జియాలాంగ్ అనే ఈ సబ్మెర్సిబుల్..పసిఫిక్ మరియానా ట్రెంచ్‌లో ఈ విజయాన్ని నమోదు చేసింది.నాలుగో డైప్లో 7,015వీటర్లు లోతుకు వెళ్లగలిగింది.ఈ సబ్మెర్సిబుల్ ద్వారా ప్రపంచంలోని 70శాతం మేర సముద్ర గర్భాల్లో సైన్స్ సంబంద సర్వేలను నిర్వహించే సామర్థ్యం చైనాకు లభిస్తుంది.నైరుతి హిందూ మహసముద్రంలోని అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాంతంలో 10వేల చదరపు కిలోమీటర్లలో పాలీమెర్సిబుల్ సల్ఫైడ్ ఖనిజం అన్వేషణకు అనుమతి పొందింది.ఈ క్రమంలో సబ్మెర్సిబుల్ చాలా ఉపయోగపడుతుందని భావిస్లున్నారు.సముద్రగర్భంలోకి చేరాక ముగ్గరు ఓషనాట్లు రోదసిలో ఉన్న ముగ్గరు చైనా వ్యోమగామములకు సందేశం పంపారు.దేశ మానవసహిత డాకింగ్ కోసం వ్యోమగాములు షెంజా-9 వ్యోమనౌకలో ఇటీవల అంతరిక్షంలోకి చేరిన సంగతి తెలిసిందే.