మహా అన్నదానo కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్
దంతాలపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి
మండలంలోని గున్నేపల్లి గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపం వద్ద స్థానిక ఎంపీటీసీ కడుదుల రాధిక మధుకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరైన డోర్నకల్ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని,పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి,మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఓలాద్రి మల్లారెడ్డి,
నాగిరెడ్డి వెంకట్ రెడ్డి, తొర్రూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ డైరెక్టర్, వీరబోయిన కిషోర్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు చిల్లా రామకృష్ణ గారు టిఆర్ఎస్ నాయకులు , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పెండ్యాల నరేష్, రామానుజాపురం సర్పంచ్ ధర్మారపు నాగయ్య, మద్దుల సుధాకర్ రెడ్డి ,మద్దుల వెంకట్ రెడ్డి , రాంరెడ్డి ,దుర్గామాత ఉత్సవ కమిటీ మెంబర్లు, మరియు గున్నెపల్లి గ్రామ ప్రజలు,టిఆర్ఎస్ నాయకులుకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.