మహికో పత్తివిత్తనాల ప్యాకెట్లు మంజూరు
పెద్దపల్లి, జూన్ 11 (జనంసాక్షి): మండలంలోని రైతులందరికి మహికో ప్రత్తివిత్తన ప్యాకెట్లు 1465 మంజూరు అయ్యాయని ఏఓ ప్రకాశ్ తెలిపారు. ఇందులో 50శాతం ఎస్సీ మరియు ఎస్టీ రైతులకు మిగతా సగం సన్న,చిన్నకారు రైతులకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో డ్రా పద్దతిలో ఎంపిక చేసి పర్మిట్లు అందజేయడం జరుగుతుందని ఏఈఓ తెలిపారు. రైతులందరూ తమ పట్టాదారు పాసు పుస్తకాలతో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12గంటల నుండి డ్రా పద్దతి ద్వారా రైతులను ఎంపిక చేయడం జరుగుతుంది. 12వతేదీన 23గ్రామాలలో 13వ తేదీన మిగిలిన 5 గ్రామాలలో ఎంపిక చేయడం జరుగుతుంది. చందపల్లి66, రంగాపూర్49, బోజన్నపేట66, గౌరెడ్డిపేట్83, నిట్టూర్43, సబితం79, గుర్రంపల్లి16, బ్రహ్మణపల్లి28, ముత్తారం38, పాలితం26, మద్దికుంట51, అప్పన్నపేట్41, కాసుల పల్లి13, కనగర్తి26, రాగినేడు83, అందుగులపల్లి43, రాఘవపూర్66,రాంపల్లి53,మారెడుగొండ46, చీకురాయి62, మూలసాల92,పెద్దబొంకూర్96, పెద్దపల్లి66, బందంపల్లి19,పెద్దకల్వల49, బొంపల్లి 38, కొత్తపల్లి99, రంగంపల్లి28 మంజూరు అయినట్లు ఏఓ తెలిపారు.