మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట ఏదీ
కఠిన చర్యలు తీసుకోవడంలో పాలకుల విఫలం
న్యూఢల్లీి,మార్చి8(జనం సాక్షి):అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఏటా జరుపుకుంటున్నా..వారి గురించి ఘనంగా చెప్పుకుంటున్నా దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింస బాగా పెరిగాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వివక్ష, వేధింపులకు గురవు తున్నారు. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు గుర్తింపు, సమాన వేతనాలు, సమాన హక్కుల కోసం, మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టడం, నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేయడంలో విఫలమైనందకు పాలకులు సిగ్గు పడాలి. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక మూల మహిళలపై అత్యాచారం, హింస, యాసిడ్ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇండ్ల దగ్గర నుంచి వసతి గృహాల వరకు ఆడపిల్లలను లైంగిక అవసరాలకు వాడుకొనే వికృత స్థితి వ్యాపించింది. అత్యాచారం, అక్రమ రవాణా,
హత్యలు సాధారణ విషయాలైపోతున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు మహిళలు, పిల్లల జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి. దేశంలో మహిళలు, బాలికలు ముఖ్యంగా దళిత బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోనూ ఉండేది. కానీ నేడు ఎందులోనూ తీసిపోమంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళామణులు. పలురంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. అయినా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు తదితర సమస్యలకు పరిష్కారం కరువైంది. ఇంటి పని, వంట పని, గృహ నిర్వహణ, పెద్దల, పిల్లల, సంరక్షణ, నీళ్ళు, వంట చెరుకు తీసుకురావటం మొదలైన పనులతో మహిళలు రోజు మొత్తం శ్రమిస్తున్నారు. భారతదేశంలో మహిళలు తమ ఇల్లు, పిల్లలు, పెద్దల కోసం చేస్తున్న జీతభత్యంలేని శ్రమ విలువ కట్టలేం. అలాగే గ్రావిూణ ప్రాంతాల్లోని రైతు, వ్యవసాయ, గ్రావిూణ కార్మికకుటుంబాల్లోని స్త్రీలు వీటితో పాటు పశువుల పెంపకం, వ్యవసాయ పనులు కూడా చేస్తారు. మంచినీరు, వంటచెరకు, పిల్లలు, వృద్ధుల సంరక్షణా కేంద్రాలు, ఆరోగ్య వసతులు అందుబాటులో లేకపోవడంతో ఈ మొత్తం బాధ్యత, పనులు ఆడవారి విూదే పడుతున్నాయి. ఇన్ని బాధ్యతలు మోస్తున్నా వారిని మనం పనివస్తువుగా చూడడం సిగ్గుచేటు. రావటంతో వారి సమయం, శక్తి మొత్తం ఈ వేతనం లేని శ్రమకే వెచ్చిస్తున్నారు. ఇటువంటి వేతనంలేని సంరక్షణ పనుల కోసం పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో మహిళలు రోజులో 5 గంటలకుపైగా వెచ్చిస్తున్నారు. వీటన్నిటితో పాటు పని ప్రదేశాలలో శ్రామిక మహిళలు వేతనాలు, సర్వీసు కండీషన్లు, గౌరవం, పదోన్నతుల విషయంలో తీవ్ర వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. పని భారం కారణంగా అత్యధిక మంది మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు వదిలేస్తున్నారు. మన దేశంలో సగం మంది మహిళలలో అత్యధిక మంది సంరక్షణ, సేవ పనులు చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, అనుబంధ పౌష్టికాహారాన్ని అందించే అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు మొదలైన స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించటం లేదు. ఇక అత్యాచార దోషులను శిక్షించడానికి బదులు దోషులతో మననేతలు అంటకాగుతున్నారు. చివరికి 3,4 ఏండ్ల పసిపిల్లలను కూడా వదలటంలేదు. ఆడవారు ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనే విషయాలపై ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలపై హింసకు పాల్పడ్డవారిని శిక్షించటానికి బదులు, ఇటువంటి ఆంక్షలతో మహిళలకే శిక్ష విధిస్తున్నారు. బేటీపడావో,..బేటీ బచావో నినాదాం వినడానికే పరిమితం అయ్యింది. మహిళా సాధికారత గురించి చెప్పడమే తప్ప అవకాశాలు రావడం లేదు.పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చి ఐదేండ్లు దాటిపోయినా కనీసం ప్రభుత్వ రంగంలోనైనా ఈ చట్టం సరిగ్గా అమలు కాకపోవటం అన్యాయం.
ఇంటిని చక్క దిద్దుకుంటునే ఉద్యోగ భాధ్యతలు నిర్వహిస్తోంది. పొలంలోనే కాదు.. సమస్యలపై పోరాటల్లోనూ అగ్రభాగాన నిలుస్తోంది. రంగం ఏదైతేనేవిూ అన్నింటా తనదైన ముద్ర వేస్తోంది. ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. పొలిటికల్‌లో కీలకమైన పదవులను అలంకరిస్తూ శాసిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతూ అన్ని రంగాల్లో ఉనికి చాటుతున్నారు. అయితే ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నా మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదు. తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఆడ పిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షను పారద్రోలిన నాడే నిజమైన మహిళా దినోత్సవంగా గుర్తించాలి.