మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ. జనం సాక్షి
మహిళల అభివృద్ధికి ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని . అది సాధ్యమైనప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. భారత జాతీయ సమాఖ్య సభ్యత్వ నమోదును మంగళవారం మండలంలోని జం కు తండాలో చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల హక్కులను పాలకులు కాలరాస్తున్నారు అని వాపోయారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు జరపకుండా కాలయాపన చేయడం తగదన్నారు. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నప్పటికీ నేటికీ వివక్షత చూపడం బాధాకరమన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ఏళ్ల తరబడి ఉద్యమాలు సాగిస్తున్న నిమ్మకు నీరెత్తినటుగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల హామీలు నీటి నీటి మూట లేనా అని. ప్రశ్నించారు . దాడులు. అత్యాచారాలను నివారించడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. హక్కుల సాధన కోసం మహిళలు సంఘటిత ఉద్యమాలు జరపాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎండి సయ్యద్. మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు ఎర్రబోతు పద్మ. దాసర్ల దుర్గమ్మ. ఎస్కే షమీం. మండల సహాయ కార్యదర్శి వారణాసి సింహాద్రి. రామలింగం. సైదమ్మ. లక్ష్మీ. రాజి. గౌరీ. లింగమ్మ. ఝాన్సీ పాల్గొన్నారు