మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా
మల్లాపూర్: మండలంలోని వాల్గొండ గ్రామంలో తాగు నీటి ఎద్దడిని నివారించాలని శనివారం మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తాగునీటి కొరతను తీర్చడంలో అధికారలు విఫలమైనట్లు పేర్కొన్నారు.