మహిళల ఆర్థిక స్వావలంబనకే స్త్రీనిధి పథకం : మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలతో పాటు మరింత ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీనిధి పథకాన్ని మంత్రి సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, స్త్రీనిధి ప్రాజెక్టు ఎండీ విద్యాసాగర్‌రెడ్డితో పాటు భారీ ఎత్తున వచ్చిన స్వయంసహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించే దిశగా సర్కారు చేపట్టిన స్త్రీనిధి పథకాన్ని సద్వినియోగం  చేసుకోవాలని మంత్రి మహీధర్‌రెడ్డి కోరారు.