మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రధాన్యం మంత్రి కొప్పుల..
=మహిళలపై హింస నివారణకు కృషి=మహిళా హెల్ప్ లైన్ 181 పట్ల అవగాహన
=మహిళను వేధిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు
=సఖి వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని ప్రారంభించిన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ భాస్కర్
మహిళల రక్షణకు ప్రభుత్వo అధిక ప్రధాన్యం ఇస్తుందని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన సఖి భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ,ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:-
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని,దీనికి సంబంధించి ప్రభుత్వం మహిళా హెల్ప్ లైన్ 181 ను ప్రారంభించామని అన్నారు. మహిళల అక్రమ రవాణాను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గృహ హింసలు, భౌతికంగా, మానసికంగా క్రుంగిపోయి, నిరాశ, నిస్పృహలతో బతుకు భారంగా వెళ్ళదిస్తున్న మహిళల జీవితాలో కొత్త వెలుగులు నింపడానికి సఖి కేంద్రం పని చేస్తాయని, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైనవారు, కుటుంబ కలహాలతో విడిపోయినవారు, జైలు జీవితం గడిపి ఆధారం లేనివారికి, వ్యభిచార వృత్తి విడిచిన వారికీ, లైంగిక, వరకట్న వేదింపులకు గురైనవారికి, హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వంటి వ్యాధుల వల నిరాదరణ పొందిన వారు, ఇలా వివిధ సామజిక సమస్యలతో సతమతమవుతున్న వారు మానసికంగా,శారీరికంగా బలపడడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని,వారికీ అవసరమైన చట్టపరమైన,న్యాయ సలహాలు అందిస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని, వారిని స్వయం ఉపాధి వైపు శిక్షణ ఇచ్చి ఆర్ధికంగా స్థిరపరుస్తామని, దీనికి ప్రజలు సహకరించాలని, మానసికంగా క్రుంగిపోయి, నిరాశ, నిస్పృహలతో ఉన్న స్త్రీల వివరాలు ఎవరికైనా తెలిస్తే స్వధార్ వారికీ సమాచారం అందించాలని తెలిపారు.
మహిళల రక్షణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకారమందించాలని మంత్రి కోరారు వ్యవస్థ అనేది భయము భక్తీ ఉన్నపుడే బాగుంటుందని, పది మంది కలిసి పని చేస్తేనే సమాజం నిర్మాణం జరుగుతుందని, స్త్రీల రక్షణ కొరకు కూడా పది మంది కలిసి పని చేయాలని అన్నారు.మహిళలు వేదనతో సఖి కేంద్రానికి వస్తారని వారి సమస్యలకు వీలైనంతవరకు సత్వర పరిష్కారం అందించాలని, దానికోసం ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పోలీసు వారి సహకారం తీసుకోవాలని సూచించారు*గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్,డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,అదనపు కలెక్టర్ బి.ఎస్.లత,కౌన్సిలర్ వొద్ది శ్రీలత, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.