మహిళా ఉద్యోగిని కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్‌

వేషం మార్చి తిరుగుతూ దొరికిపోయిన దుండగుడు
సిమ్లా,మే4(జ‌నం సాక్షి ):  ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలిలో అక్రమ కట్టడాలు కూల్చుతున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాల్చి చంపిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. వేషం మార్చి, ఫోన్‌ మార్చి తిరగుతున్న నిదితుడిని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. సహాయ పట్టణ ప్రణాళిక ఉద్యోగిగా పనిచేస్తున్న షైల్‌ బాల్‌ అనే మహిళా ఉద్యోగిని మంగళవారం ఓ ¬టల్‌ యజమాని విజయ్‌ తుపాకీతో కాల్చి చంపాడు. బుల్లెట్లు మరో ఉద్యోగికి కూడా తగిలాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల అనంతరం విజయ్‌ సవిూపంలోని అడవుల్లోకి పారిపోయాడు. పోలీసులు రెండ్రోజుల పాటు గాలించి అతడిని ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆలయం వద్ద గుర్తించి అరెస్ట్‌ చేశారు. పోలీసులు తనను గుర్తించకుండా ఉండేందుకు విజయ్‌ విూసాలు తొలగించి, జుట్టు కత్తిరించి వేషం మార్చుకున్నాడు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, తన ఫోన్‌ స్విచాఫ్‌ చేసి వేరే వ్యక్తుల ఫోన్ల నుంచి కాల్స్‌ చేశాడని పోలీసులు వెల్లడించారు. కాల్పుల జరిపిన తర్వాత అడవుల్లోకి పారిపోయిన విజయ్‌.. కొన్ని గంటల పాటు అడవిలో ఉండి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడని, తన ఏటీఎం, ఆధార్‌ కార్డు తీసుకుని దిల్లీ వైపునకు బస్సులో వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వేర్వేరు ప్రాంతాలు తిరిగాడని చెప్పారు.
న ¬టల్‌ను కూల్చొద్దని ఎంత అడిగినా అధికారి వినలేదని, లంచం ఇస్తానన్నా అంగీకరించలేదని నిందితుడు పోలీసుల విచారణలో అన్నట్లు సమాచారం. ¬టల్‌ కూల్చొద్దని తన తల్లి ఆమె కాళ్లు పట్టుకున్నా కూడా కూల్చివేత ఆపలేదని, అందుకే ఆమెను కాల్చానని వెల్లడించినట్లు తెలిసింది. లంచం ఇస్తానంటే తీసుకోకుండా ఆదర్శవంతమైన అధికారిగా ప్రవర్తించారని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కూల్చుతున్నామని ఆమె చెప్పారని విజయ్‌ అన్నట్లు తెలుస్తోంది. సొలన్‌ జిల్లా కసౌలి, ధర్మపుర్‌ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన 13 ¬టళ్లను కూల్చివేయాలని ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడానికి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం తొమ్మిదేసి మంది ఉద్యోగులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. కసౌలి పట్టణంలో నారాయణి అతిథిగృహాన్ని కూల్చివేస్తుండగా, దాని యజమాని విజయ్‌.. బృందానికి నేతృత్వం వహిస్తున్న షైల్‌ బాలాతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత తుపాకీతో కాల్పులు జరిపి సవిూప అడవుల్లోకి పారిపోయాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మహిళా అధికారిని ప్రభుత్వం కాపాడలేకపోయిందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం వల్ల జరగలేదని, చట్టాన్ని అమలు చేయలేకపోవడం వల్ల జరిగిందని కోర్టు పేర్కొంది. నిందితుడు పారిపోవడంపైనా కోర్టు ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ అధికారిని హత్య చేసి నిందితుడు పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
—-