మహిళా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
జోథ్‌పూర్ : భారత వాయుసేన (ఐఏఎస్) మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చోటేచేసుకుంది. కోల్‌కతాకు చెందిన ఆనందితాదాన్ (29) జోథ్‌పూర్ ఏయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో గ్రౌండ్ డ్యూటీ అధికారిగా పనిచేస్తోంది. ఏయిర్‌ఫోర్స్ అధికారి అయిన భర్తతో కలిసి సంస్థ క్వార్టర్స్‌లో ఉంటోంది. అయితే ఉదయం ఆమె తన క్వార్టర్స్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఎన్‌డీ గోస్వామి తెలిపారు.