మహిళా మేనేజర్‌ దారుణహత్య

చేగుంట : సమీపంలో రహదారి పక్కన ఒక మహిళ ఈ ఉదయం దారుణహత్యకు గురయ్యారు. మండలంలోని పోలంపల్లిలో డెకార్‌ పరిశ్రమలో మేనేజరుగా పనిచేస్తున్న అర్తీష్‌ సద్వాని (50) మంగళవారం ఉదయం వ్యాహ్యళికి వెళ్లి హత్యకు గురైంది. అమె పరిశ్రమకు రాక పోవడంతో సహోద్యోగులు అరా తీయగా రోడ్డు పక్కన శవమై కనిపించింది.సంఘటనా స్థలాన్ని తూప్రాన్‌ డీఎస్పీ శ్రీనివాసరావు ,ఎస్సై వినాయక రెడ్డిలు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.