మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ.
మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ గుప్త.
తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ అనిమున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ గుప్త పేర్కొన్నారు.
ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు పుట్టిన ముద్దుల బిడ్డ చిట్యాల ఐలమ్మ అలియాస్ (చాకలి ఐలమ్మ) జయంతి సందర్బంగా సోమవారం తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఐలమ్మ అమర్ రహే అమర్ రహే అమర్ రహే ఐలమ్మ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నాడు చేసిన పోరాట ప్రతిమ దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి పోవాలని పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు. దున్నేవాడి దే భూమి అనే నినాదంతో పోరాటం కొన సాగించి ఎంతోమంది పేద ప్రజలకు భూమిని ఇప్పించిన ఘనత చాకలి ఐలమ్మదేనని అన్నారు. నేటి సమాజం వారి జీవిత త్యాగాల ను గుర్తు చేసుకొని వారి ఆశాల కోసం పనిచే యాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాలనర్సింహులు , సాజిద్ హలి , ప్రవీణ్ గౌడ్ , వెంకన్న గౌడ, బోయ రవి రాజు, నాయకులు బి.రఘు ,మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.