మహిళా శక్తి సాధననే కాంగ్రెస్ లక్ష్యం
జనం సాక్షి దుబ్బాకత్రివర్ణ పథకాన్ని ప్రతి మహిళా ఎగురా వేసే విధంగా ముందుకు రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రచార కమిటీ మెంబర్ కత్తి కార్తీక గౌడ్ అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రచార కమిటీ మెంబర్ కత్తి కార్తీక గౌడ్కార్యకర్తలు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.శక్తి సూపర్ షి అనే కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం జరిగే ఆగస్టు 15 వ తేదీన జాతీయ పథకాన్ని దుబ్బాక మహిళలతో కలిసి జెండా రేపరెప లాడించి వందనం చేస్తామన్నారు.
ప్రతి మహిళలను ఒక సోదరి లా చుడండి. మన ఇంటి నుండి గౌరవ మర్యాదలు నేర్పడం మొదలు పెట్టాలి. మణిపూర్ లో జరిగిన ఘటన విషయంలో మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీలకి గాని మహిళలకు గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సమానత్వం కల్పిస్తుంది అని అన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్యాస్ ధర 500 రూపాయలకే,వృద్దులకు, ఒంటరి మహిళకు 4 వేల పింఛనులను ప్రజలకు చేరువయ్యే విధంగా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణల శ్రీనివాస్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త దేవి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు జలంధర్ రెడ్డి, మహిళా నాయకురాలు చిట్టాపూర్ లక్ష్మి, ఆమోస్,ఓబిసి సాయ గౌడ్,పలువురు పాల్గొన్నారు.